Nutshell Advertising https://nutshelladvertising.com Lets Get Cracking | Top Branding, Web and Advertising Agency in Hyderabad Mon, 16 Jan 2017 07:20:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=4.7.3 Women jayaho https://nutshelladvertising.com/women-jayaho/ Thu, 19 May 2016 13:17:53 +0000 http://nutshelladvertising.com/?p=1378

బడా సంస్థలకు బ్రాండింగ్‌

00

సాధించాలంటే సాహసం చేయాలి. అపారమైన అనుభవం అక్కర్లేదు… చక్కని ఆలోచన ఉంటే చాలు అంటోంది నేటితరం.ఆ యోచనే పునాదిగా ‘‘నట్‌షెల్‌’’ పేరుతో సంస్థను ప్రారంభించి బడా బడా సంస్థలకు సైతం బ్రాండింగ్‌ చేస్తోంది శాలిని కొండేపూడి. ఈ యువతరం ప్రతినిధి అనుభవాలన్నీ తన మాటల్లో….
ఒకప్పుడు నేను చదివిన చదువుకి తగ్గ అవకాశాలు రావన్న భయంతో బెంగళూరుకో, ముంబయికో వెళ్లిపోదామనుకున్నా. అంతకంటే ముందు మెడిసిన్‌ చేద్దామనుకున్నా…కానీ, మంచి ర్యాంకు రాకపోవడంతో నా ఆలోచన మార్చుకున్నా. సృజనాత్మకత, నిత్యనూతనం అయిన జర్నలిజం నన్ను ఆకర్షించింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో మాస్‌ కమ్యూనికేషన్స్‌ పూర్తి చేశా. ఆపై ఓ యాడ్‌ ఏజెన్సీలో కొంత కాలం పనిచేశా. తరవాత ఏదైనా సొంతంగా చేయాలి అనుకుంటున్నప్పుడు… నా చిన్ననాటి స్నేహితుడు సిద్దార్థను కలిశా. నా ఆలోచన చెప్పగానే ‘ఇద్దరం కలిసి ఓ కొత్త వెంచర్‌ ప్రారంభిద్దాం’ అన్నాడు. మా ఆలోచనలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇద్దరం వెంటనే ఉద్యోగాలు మానేశాం. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పనులు మొదలెట్టాం. ఇలా మేం ‘‘నట్‌షెల్‌’’ పేరుతో రెండేళ్ల క్రితం సంస్థను ప్రారంభించాం. దీని ద్వారా… ప్రింట్‌, డిజిటల్‌, వెబ్‌మీడియా విభాగాల్లో బ్రాండింగ్‌ చేస్తాం. అంటే లోగోలు రూపొందించడం, వెబ్‌సైట్‌లు నిర్వహించడం, ఆయా సంస్థలకు, అవి ఇచ్చే రాయితీలు, ఈవెంట్లకు అవసరమైన ప్రచారాలు చేస్తాం. హోర్డింగ్‌ల ఏర్పాటే కాదు…ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లస్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల పేజీలను నిర్వహిస్తుంటాం.
రోజుకు 20 గంటలు….
ఉద్యోగం చేసి దాచుకున్న డబ్బు కాస్తా సంస్థ ఏర్పాటుకూ, ఇతర చిన్నచిన్న పనులకు ఖర్చు పెట్టేందుకే సరిపోయింది. మరిన్ని పనులు మొదలు పెట్టాలంటే కనీసం ఒక మ్యాక్‌ కంప్యూటర్‌ అయినా ఉండాలి. లక్షల ఖరీదు ఉండే దాన్ని కొనే పరిస్థితీలేేదు. పోనీ కనీస వ్యాపార అనుభవమున్నా, ఆర్డర్లు తీసుకునేప్పుడే అడ్వాన్స్‌ అడిగి తీసుకోవచ్చు. అదీ లేదు. ముందు మా పని తీరుని కొంత మేరకైనా వినియోగదారులకు చూపించగలగాలి. పనులు మొదలుపెట్టాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడే ‘‘కున్నూస్‌’’ అనే సరకుల దుకాణం మాకు అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అప్పటివరకూ స్నేహితుల సాయంతో ఎలాగోలా నెట్టుకొచ్చిన మేం ఇక ముందుకు వెళ్లలేకపోయాం. కుటుంబసభ్యుల మీద ఎట్టిపరిస్థితుల్లోనూ ఆధారపడకూడదనుకున్నాం. ఎంత కష్టం ఎదురైనా పరిష్కారం మేమే వెతుక్కోవాలనుకున్నాం. అందుకోసం ఓ ఏజెన్సీలో పనిచేస్తూ, వారి మ్యాక్‌లను మా సంస్థ కోసం వాడుకునేలా ఒప్పందం చేసుకున్నాం. అలా వారి దగ్గరే మా పనులు ప్రారంభించాం. తొలి అవకాశం కదా! ఎక్కడా లోపం రాకూడదని రాత్రింబవళ్లూ ఇద్దరం పనిచేసేవాళ్లం. రోజులో ఇరవై గంటల సమయం పనిచేసిన సందర్భాలెన్నో. ఈ ‘కష్టాలేంటి! మీరింకా చిన్నపిల్లలు… కెరీర్‌ మొదట్లో ఇటువంటి సాహసాలెందుకు హాయిగా ఉద్యోగాలు చేసుకోంœ’ అంటూ అంతా పదేపదే చెప్పేవారు. కానీ మమ్మల్ని మేం నిరూపించుకోవాలన్న తపనతో మా పని మేం చేసుకుంటూ వెళ్లేవాళ్లం. కొన్నాళ్లకి పని పూర్తైంది. మొదట మాకెలాంటి అనుభవం లేదని భయపడిన ఆ సంస్థే.. మా పనితీరుకి సంతృప్తి పడింది. డెబ్భై ఐదువేల రూపాయల చెక్‌ ఇచ్చింది. ఆ రోజు చూడాలి మా సంతోషం. హుషారుగా వెళ్లిపోయి ఆ డబ్బుతోపాటూ.. క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఓ మ్యాక్‌ని కొనుకున్నాం.
సామాజిక మాధ్యమాల్లోనూ…
పెట్టుబడి లేకుండా వ్యాపారం అంటే మామూలు విషయం కాదు. ఆర్డర్లు తెచ్చుకోవాలి. వినియోగదారుడి అవసరాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్దాలి. అనుశీలన చేస్తూ ఎప్పటికప్పుడు మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. సంస్థకో బ్రాండ్‌ ఏర్పాటు చేయాలంటే లోగో దగ్గర్నుంచి వాడే రంగు, ఆకృతి ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని పూర్తి చేయడానికి కొద్ది సమయం పడితే…దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. ఇవన్నీ మార్కెటింగ్‌ వ్యూహాలు అయితే ఒక బ్రాండ్‌కి ఇమేజ్‌ సృష్టించడానికి మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు వేగంగా ప్రచారం చేయడానికి సోషల్‌ మీడియా చక్కని వేదిక. దాని ప్రకారం డిజిటల్‌ మార్కెటింగ్‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ట్విట్టర్‌ వంటి పేజ్‌లను నిర్వహించడం, వివిధ ఈవెంట్లకు ప్రచార చిత్రాలు రూపొందించి, ప్రజల్లోకి వెళ్లేలా చేస్తాం. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలపై పట్టుండాలి. మారుతోన్న ట్రెండ్‌లు తెలుసుకోగలగాలి. అంటే ఉదాహరణకు ఇస్రో ప్రయోగించిన మంగళయాన్‌ను సైతం లాండ్రీ సర్వీసులకు లంకె కుదర్చగలగాలి. ఏ ప్రచారమైనా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలిగా మరి. నోవోటెల్‌ స్వే్కర్‌ క్యాంపెయిన్‌ చేసినా, హైదరాబాద్‌ హంటర్స్‌ ప్రీమియర్‌ బాడ్మింటన్‌ను ప్రమోట్‌ చేసినా ఇదే సూత్రం మాది. సామన్యుడి నుంచి సెలబ్రిటీలు వరకూ ఆ దారి పట్టేలా చేయగలగాలి.
పెద్ద పెద్ద సంస్థలకూ..
ఇదంతా ఒత్తిడితో కూడుకున్న రంగం. అయినా కొది ్దరోజుల్లోనే మేం మా ప్రత్యేకతను చాటుకోగలిగాం. పోటీ కూడా ఎక్కువే. అలాని అక్కడే ఉండిపోలేం కదా! ఎంత బాగా చేసినా కొన్నిసార్లు ఖాతాదారుడి ప్రాథమ్యాలు అప్పటికప్పుడు మారొచ్చు. లేదా సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులూ ప్రభావితం చేయొచ్చు. ఆ మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఇన్ని పనులు మొదట్లో అయితే ఇద్దరమే చేసేవాళ్లం. అవసరాలకు అనుగుణంగా సిబ్బంది అవసరం పడటంతో వారి సంఖ్యా పెరిగింది. ప్రస్తుతం మా సంస్థలో పదిహేను మంది సిబ్బంది ఉన్నారు. ఆ తర్వాత ఇక మేం వెనక్కి తిరిగి చూసుకోలేదు. మెర్క్యూర్‌ హోటల్స్‌, నోవోటెల్‌, ఎస్‌ బ్రిక్స్‌, మేరా ఈవెంట్స్‌ సీటింగ్‌ వరల్డ్‌, మెట్రోరైల్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, ప్రసాద్‌ ఐమాక్స్‌, నాస్కామ్‌ వంటి ప్రముఖ సంస్థలు మా ఖాతాదారులుగా ఉన్నాయి. ఇప్పటివరకూ వందకు పైగానే ప్రాజెక్టులూ చేశాం.
సవాళ్లెన్నో…
ఇప్పుడు ప్రతినెలా కనీసం మా దగ్గర పది ప్రాజెక్టులుంటున్నాయి. మరి సమస్యలేం లేవా అంటారా? ఎందుకుండవు…? మేం చేసే పనిని ఏ రోజుకారోజు వచ్చిన మొత్తాన్ని లెక్కేసే పరిస్థితి ఉండదు. పని పూర్తి చేసినా వారి దగ్గర్నుంచి డబ్బులు రావడానికి సమయం పడుతుంది. మొదట్లో అయితే కొన్ని పెద్ద సంస్థలు సైతం పని పూర్తయ్యే వరకూ బాగుందని తీరా చెక్‌లు ఇచ్చేప్పుడు మాత్రం లోపాలు వెతికేవారు. ఉద్యోగులకు మేము మాత్రం నెల తిరిగేసరికి జీతాలు ఇచ్చేయాలి కదా! ఇప్పుడిప్పుడే సమస్యలు దాటి ఆదాయం అందుకుంటున్నాం. అన్నట్లు చెప్పనేలేదు కదూ నా స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సిద్దార్థ భర్తగా మారాడు. ఇద్దరి ఆలోచనలూ, లక్ష్యాలూ ఒకలానే ఉండేవి. అలా సాగిన మా స్నేహ బంధం చివరకు ప్రేమగా మారింది. ఆ తరవాత పెళ్లి పీటలెక్కాం. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా విజయంతంగా సాగిపోతుండటంతో మా పెద్దవాళ్లూ ఎంతో సంతోషిస్తున్నారు.
– స్వాతి కొరపాటి

]]>